ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ నాయకులు కొత్త బాట పట్టారు. రాష్ట్ర గవర్నర్ అయిన నరసింహన్ తో ఢిల్లీలో మంతనాలు జరిపిపట్లు తెలుస్తోంది. గతంలో.. గవర్నర్ మీడింగ్ ను అడ్డుకున్న నాయకులే ఈరోజు కాళ్ల బేరాని వచ్చి సహయం అడిగినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సహకరించాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలు కోరినట్లు తెలుస్తోంది. టి-ఎం.పిలు నరసింహన్‌తో రెండు గంటల పాటు చర్చలు జరిగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. . ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి వారు నరసింహన్‌కు వివరించి చెప్పినట్లు తెలంగాణ నాయకులు అంటున్నారు. . టి ఎం.పిలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, జి.వివేక్‌లు గవర్నర్‌తో సమావేశమై తెలంగాణ ఏర్పాటు గురించి లోతుగా చర్చలు జరపటం వలన తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గవర్నర్ నరసింహన్ మనసు మార్చేందుకే టి ఎం.పిలు ఆయనను కలిశారని ఆంటున్నారు. తెలంగాణ ప్రజలకు ఏ రంగంలో అన్యాయం జరిగినా తన దృష్టికి తెస్తే దానిని సరిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని గవర్నర్ వారికి హామీ ఇవ్వటం జరిగిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.. రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని టి-ఎం.పిలతో చెప్పినట్లు సమాచారం..
రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియదు కాని, కాంగ్రెస్ నేతలు ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకత్వం మార్పుపైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తప్ప కనీసం తెలంగాణాలో అయినా కాంగ్రెస్ బతకదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు , ముఖ్యంగా ఎమ్.పిలు ఢిల్లీలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా రకరకాల రూపాలలో కాంగ్రస్ అదిష్టానం సమాచారం సేకరిస్తోంది. ఇందులో గవర్నర్ నరసింహన్ పాత్ర కూడా ప్రముఖంగానే ఉండవచ్చని అంటున్నారు.అదే సమయంలో మొన్నటివరకు సమైక్య వాదం గురించి మాట్లాడుతూ వచ్చిన కోస్తా నేతలలోకాని, రాయలసీమ నేతలలో కాని కొంత మార్పు కనిపిస్తోంది.రాయల తెలంగాణ అయితే ఒకే అని జెసి దివాకరరెడ్డి చెబుతున్నారు. అలాగే టిజి వెంకటేస్ వంటి వారు కూడా కాస్త బిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ నేపద్యంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని కోస్తా కు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు.అలా అని అదిష్టానం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అంతా బావిస్తున్నారు. కాకపోతే గతంలో సమైక్యవాదానికి అనుకూలంగా ఉన్న కొందరు కూడా అదిష్టానం పెద్దలలో కొంత మార్పు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దానిని గమనంలోకి తీసుకునే సర్వే సత్యనారాయణ వంటి ఎమ్.పిలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెబుతున్నారని భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక లలో బిజెపి మద్దతు ఇస్తున్న సంగ్మాను కలుసుకోవడానికి కూడా టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ ఇష్టపడకపోవడం కూడా ఒక కీలక పరిణామంగా చెబుతున్నారు.మొత్తం మీద అదిష్టానంలో తెలంగాణ అంశంపై కొంత కదలిక ఉన్నట్లు కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more